రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం గోదాదేవికి ప్రీతికరమైన ధనుర్మాస వ్రతం గోదాదేవి అమ్మవారికి నిర్వహించారు. పెంచలకోన క్షేత్రంలోని స్వామి వారి వనంలో పండిన ఫలాలు పూలతో ప్రత్యేకంగా అలంకరించచారు. అర్చకులు, దేవస్థాన భజంత్రీలు భక్తులు కనువిందు చేసే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా గోనుపల్లి వాసి బాలకృష్ణ వ్యవహరించారు.