కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ : వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు కలువాయి మండలం నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. బస్సు యాత్ర విజయవంతం చేయడానికి వైసీపీ నాయకులు చేసిన కృషి విజయవంతంగా జరిగింది. మండలం నుంచి 10 బస్సు ల్లో జనం ను నాయకులు తరలించారు. మండలం లో మొత్తం 38 గ్రామాల నుంచి ప్రజలు తరలి వెళ్లారు. బస్సు లే కాకుండా కార్లు,ఆటోల్లో వెళ్లారు. వైసీపీ పార్టీ జెండాలను వాహనాలకు కట్టుకొని ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. కుల్లూరు గ్రామం నుంచి మండల జేసీఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్ రెండు బస్సు ల్లో జనాన్ని తరలించారు. మండల పార్టీ అధ్యక్షులు మాకిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 8 బస్సుల్లో వెళ్లారు.
…………
ఫోటో రైటప్
కుల్లూరు నుంచి బస్సు ల్లో బయలుదేరిన జనం.