వెంకటగిరి : తిరుపతి జిల్లా వెంకటగిరి మండల వైసిపి అధ్యక్షులు కాంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ నేదురు మళ్ళీ రాంకుమార్ రెడ్డి జన్మదినం బాల సదన్ లో ఘనంగా నిర్వహించారు. వెంకటగిరి పట్నం రాణి పేట లో ఉన్న బాల సదన్ లో అనాధ పిల్లలకు దుప్పట్లు, బ్యాగులు నెమలపూడి సురేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వైసీపీ రూరల్ అధ్యక్షుడు కల్తీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మనసున్న మారాజు అని, రావో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి వచ్చే జన్మదినం రోజు ఎమ్మెల్యే హోదాతో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జే సి ఎస్ కన్వీనర్ వెంకటేశ్వర్లు, మండల కమిటీ ట్రెజరర్ టి రాజారెడ్డి, హరినాథ్ రెడ్డి, సదానంద రెడ్డి, లాలాపేట సొసైటీ అధ్యక్షులు భాస్కర్, మాజీ సర్పంచ్ తిరుమల, జికేపల్లి నాగయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.