కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :
కలువాయిలోని విశ్వం హైస్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులు సోమవారం జరుపుకున్నారు.
చిన్నారులు బోగి మంటలతో పాటు ముగ్గులు వేసి సంబరాలు చేసుకున్నారు. కలువాయిలోని విశ్వం హైస్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి.
చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో అందంగా ముగ్గులు వేశారు. సంబరాలు జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. స్కూల్ లో సోమవారం జరిగిన ముందస్తు సంక్రాంతి సంబురాలను కరస్పాండెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. పల్లెటూళ్ళ రైతులు పంటలు చేతికి వచ్చిన తరువాత సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో గుడిసెలు వేసి హరిదాసు, బొమ్మలకొలువు, గొబ్బెమ్మలు, భోగిపళ్లు తదితర వాటితో ఈ సంబరాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అలాగే విద్యార్థులు వేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ వేడుకల్లో భాగంగా సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన చిన్నారులు అందమైన ముగ్గులు వేశారు. విద్యార్థులకు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.