జన్ భగీ దారి కార్యక్రమం పై విద్యార్థులు భారీ ర్యాలీ.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ : అంబేద్కర్ రచించిన రచనలను పాఠ్య పుస్తకాలల్లో ప్రవేశ పెట్టాలని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నిజమాల ప్రసాద్.ప్రభుత్వా కోరారు.కలువాయి లో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు జన్ భగీ దారి కార్యక్రమం పై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంపీడీఓ గోవర్ధన్, ఎం ఈ ఓ శేషు గిరి, ఏ డి పి ఎస్ జిల్లా అధ్యక్షులు నిజమాల ప్రసాద్ పువ్వుల మాల వేసి నివాళులు అర్పించారు.
బస్టాండ్ సెంటర్ లో మానవహారం గా ఎర్పడి అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బస్టాండ్ సెంటర్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంపీడీఓ గోవర్ధన్, ఎం ఈ ఓ శేషు గిరి, ఏ డి పి ఎస్ జిల్లా అధ్యక్షులు నిజమాల ప్రసాద్ పువ్వుల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా..జిల్లా అధ్యక్షులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ…విజయవాడ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాల ప్రజల అదృష్టం చెప్పారు. అనంతరం సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉషారాణి మాట్లాడుతూ…సింబల్ అఫ్ నాలెడ్జి అంటేనే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని చెప్పారు. ఈ 8 వ తేది నుంచి 19 వరకు జన్ భగీ దారి కార్యక్రమం పై విద్యార్థుల కు పోటీ లు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఈ ఓ పి ఆర్ డి నారాయణ, ఎం ఆర్ పి ఎస్ మాజీ మండల అధ్యక్షులు దండు పెంచలయ్య, ఉపాధ్యాయులు, స్వచ్చంద సేవా సంస్థ ల ప్రతినిధులు పాల్గొన్నారు.