గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) డైరీని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, విజయవాడ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.సాంబశివరావు (కలిమిశ్రీ), ఎం.బి.నాథన్, నగర నాయకులు రాఘవేంద్ర శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ బాబు కుర్రా తదితరులు పాల్గొన్నారు.