కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్..
రాబోయే రోజుల్లో ప్రపంచం లోకేల్లా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశం భారత దేశం అవుతుందని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జి ఎస్ ఎస్ ఆర్ నాయుడు చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కలువాయి మండలం బద్వేలు లో అధికారులు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రము లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం వ్యవసాయానికి డోన్ ద్వారా పురుగు మందు పిచికారీ చేసే విధానం ను ప్రజలు చూపారు.ప్రోజెకటర్ ద్వారా సంక్షేమ పథకాల గురించి మోదీ ప్రసంగం చూపారు.ఈ సందర్బంగా ఎస్ ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ…..భారత దేశ వ్యాప్తంగా 50 కోట్ల మందికి జన్ ధన్ బ్యాంకు అకౌంట్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టి జీరో బేలన్స్ చేయించారని ఆయన తెలిపారు.విశ్వకర్మ యోజన పథకం కింద బ్యాంకు ద్వారా చేతి వృత్తి పనులకు లోన్లు ఇస్తారని చెప్పారు. ఎక్కువ డిజిటల్ లావాదేవీలు, ఎక్కువ అకౌంట్ కలిగిన దేశం భారత దేశమని తెలిపారు.రాబోయే రోజుల్లో ప్రపంచం లోకేల్లా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశం భారత దేశం అవుతుందనిఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో అయోధ్య రాముని అక్షింతలను ఎస్ ఎస్ ఆర్ నాయుడు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ గోవర్ధన్, ఎం ఈ ఓ శేషు గిరి, మండల స్థాయి అధికారులు, మహిళ లు, ప్రజలు పాల్గొన్నారు.