గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సైతం మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు