వన్ టైం సెటిల్మెంట్ విషయంలో సీఎం హామీ మేరకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు
వెలగపూడి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్ సెక్రటరీ తో విఆర్ఓల సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ల రేషియో, వన్ టైం సెటిల్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి హామీ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని, సర్వే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన గ్రేడ్-2 విఆర్వోలకు, వెంటనే ప్రొబిషన్ డిక్లేర్ చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వీస్ మేటర్స్, విజిలెన్స్, ఫెంక్షన్స్, విభాగంలో పనిచేసే వారు సీసీఎల్ఏ కార్యాలయంలో గాని, ఇతర కలెక్టరేట్ కార్యాలయంలో గాని, పనిచేసేవారు ఏ అసోసియేషన్ లో ఉన్న వారిని కూడా నియమించకూడదని, రెవిన్యూలో అనేక రకమైన సంఘాలు ఉన్నాయని, కేవలం ఏపీ ఆర్ ఎస్ ఎ పనిచేస్తున్న వారు చాలామంది ఈ సెక్షన్లో పనిచేయడం వల్ల ఇతర రెవెన్యూ సంఘాలకు సంబంధించి ఫైల్స్ విషయంలో కావాలని కొన్నిసార్లు ఫైల్స్ కూడా పెట్టకుండా చేయడం జరుగుతుందన్నారు. సకాలంలో ఫైల్స్ క్లియర్ చేయకపోతే ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు చాలా చెడ్డ పేరు వస్తుందని, ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆఫీసులో పనిచేసేవారు ఏ అసోసియేషన్లో ఉన్న వారిని సర్వీస్ మేటర్స్ సెక్షన్లో మరియువిజిలెన్స్ సెక్షన్ లో,ఫెంక్షన్స్ సెక్షన్ల లో నియమించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర సీసీఎల్ఏ కార్యాలయంలో కేవలం ఏపీ ఆర్ఎస్ఎ వారికి మాత్రమే ఆఫీస్ కేటాయించడం వల్ల సీసీఎల్ఏ ఆఫీస్ సొంత ఆఫీస్ లా ఉపయోగించుకుంటూ ఇతర సంఘ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇతర రెవెన్యూ సంఘాల వారు సిసిఎల్ఏ లో ఆఫీస్ కేటాయించాలని కోరుతున్నా ఎవరికీ కేటాయించకుండా కేవలం ఏపీ ఆర్ ఎస్ ఎ వారికి మాత్రమే ఎందుకు కేటాయించడం జరిగిందన్నారు. సిసిఎల్ఏ లో వారికి ఆఫీసు ఉండడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఏపీ ఆర్ ఎస్ ఎ సభ్యులు సర్వీస్ మేటర్స్ ,విజిలెన్స్, ఫెంక్షన్స్ విభాగంలో ఉండడం వల్ల చాలామంది ఉద్యోగుల పనులు కాక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకుని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో డివిజన్, మండల స్థాయిలో ఎవరు కూడా అసోసియేషన్ లో పనిచేసే వారిని ఆ సెక్షన్స్ లో నియమించకూడదని ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ, వి. ప్రసన్న లక్ష్మీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ అనూష, చైతన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు,ప్రభాకర్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీరామ చంద్ర మూర్తి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షులు, రామ్ రెడ్డి, జిల్లా ఉపధ్యక్షులు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.