బాలాయపల్లి :-
మంచు వల్ల పాడి పశువులు అంటు వ్యాధులు వచ్చే ప్రమాధం ఉందని బాలాయపల్లి పశువై ధ్యాధికారి వెటర్నరి డా.సుధీర్ పేర్కోన్నారు. గూరువారం మండలంలోని జయంపు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్,పశుసంవర్ధక శాఖ ఆద్వ ర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు . ఈ సందర్భంగా 190 గొర్రెలు, మేకలకు,42 గేదెల కు,35 దూడలుకు నట్టల నివారణ మందులు పంపిణి చేశారు.ఇక గొర్రలు కు నోటి పుండ్లు,నీలి నాలుక ,జనరల్ పరిక్షలు నిర్వహించారు.ఇక గేదెలకు సూడి పరీక్షలు నిర్వహించారు.అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ ఉచితంగా మందులు పం పిణి చేసినారు.ఇక పాడి రైతులకు పశువుల ఆరోగ్యం పైన తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగా హన కల్పించారు.అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్ సమాచార సేవలు పంటలు, పశు వులకు సంబందించిన సూచనలు సలహాలు, వాతావరణ వివరములు టోల్ ఫ్రీ నెం. 18004 198800 ఫోన్ చేసి మీరు సమాచారం పొందవ చ్చున్నారు.ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ సపోర్టర్ వెంకటరమణ,ఏహెచ్ఏ వెంగళ రావు , రైతులు పాల్గొన్నారు.
పోటో :-పరిక్షలు చేస్తున్న దృశ్యం