వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంకటగిరి మండల రూరల్ పారవోలు యువత ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఏడాది నూతనంగా టోర్నమెంట్ తో 20 జట్లు టీం లతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ క్రీడలో ఏర్పాటు చేశారు. పారవోలు గ్రామ యువత ఆర్గనైజర్ శశి కుమార్ మల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీటీసీ పుల్లూరు శ్రీదేవి సదానంద రెడ్డి మాజీ ఎంపీటీసీ తోట రామచంద్రయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటగిరి పట్టణ ఎస్సై నరసింహారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి యువకుడు ఉత్సాహంగా క్రీడల పట్ల ఎంతో ఆసక్తిగా సహనంతో క్రీడలు ఆడాలి గెలుపు ఓటములు సహజం మనిషి జీవనశైల్లో క్రీడలు ఎంతో ప్రాముఖ్యతమని యువత మసికంగా దృఢ సంకల్పంగా ఎదుగుదలకు ఎంతో గాను క్రీడలో యువతకు అవసరం అని తెలియజేశారు నేడు తొలి రోజున వెంకటగిరి పట్టణ మల్లమ్మ గుడి యువత నాగయ్య కాలేజీ యువత తలబడ్డారు రెండు జట్లను ఎస్ఐ నరసింహారావు పరిచయ కార్యముతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.
తొలిత బ్యాటింగ్ చేసిన మల్లమ్మ గుడి జట్టు 10 ఓవర్లో 84 పరుగులు సాధించింది, అనంతరం నాగయ్య కాలేజీ క్రికెట్ యువత 10 ఓవర్లలో 74 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు.