ప్రజాశక్తి వెంకటగిరి: గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ శుక్రవారం వెంకటగిరి నేదురుమల్లి బంగ్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, వైసీపీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కృతజ్ఞతా భావంతో కలిశారు. ఎంతోకాలంగా గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎవరు ఎవరు అనే ఆత్రుతలో గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఉన్న సమయంలో ఓ అధికారి పోటీపడుతున్న తరుణంలో వైసిపి గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్న సమయంలో మేరుగ మురళీధర్ ను గుర్తించడం కారణం రామన్న మాట, అందులో భాగంగా మేరుగ కృతజ్ఞతా భావంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు గూడూరు వైసీపీ నాయకులు ఉన్నారు.