500 మంది మహిళ లకు బహుమతులు ఇచ్చిన మాదాసు కుటుంబం.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్..
గ్రామీణ ప్రాంతాల్లో ముగ్గుల పోటీలను చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మా నాధ్ చెప్పారు. సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని కలువాయి మండలం కుల్లూరు పంచాయతీ దాతత్తు స్వీకర్త మాదాసు నలినమ్మ నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేత లకు జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మా నాధ్, జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ బహుమతులను హైస్కూల్ ఆవరణలో ప్రధానం చేశారు. ఈ సందర్బంగా పిల్లలతో ఎర్పాటు కల్చరల్ పోగ్రామ్ ఆకట్టుకుంది.ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మా నాధ్ మాట్లాడుతూ……సంక్రాంతి సంబరాలు చేసేందుకే తాను ఈ పోగ్రామ్ కు రావడం జరిగిందని తెలిపారు. పల్లెటూరు లో నీరు, గాలి చాలా పరిశుభ్రం గా ఉంటాయని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ఈ పండుగ లకు దూరం గా ఉన్నానని తెలిపారు.పల్లెటూరు ల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసేందుకే ఇక్కడ కు వచ్చానని చెప్పారు. చాలా సంతోషం గా ఉందన్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ…ప్రజలు సుఖ సంతోషా లతో ఉండాలని చెప్పారు.పూర్వికులు సంప్రదాయాల ను మరచి పోకుండా పల్లెల్లో ఈ లాటి ముగ్గుల పోటీలను పెట్టడం చాలా సంతోషం అని చెప్పారు బావి తరాల వారికీ ఈ వీ గుర్తుండి పోతాయని చెప్పారు. ఈ కార్యక్రమం లో వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం, జె సి ఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.
……….
సార్ కుల్లూరు లో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేస్తున్న జేసీ కుర్మా నాధ్.