విజయవాడ : ఏపీలో మరో రెండు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా మరోమారు పీవీజీడీ ప్రసాదరెడ్డిని నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ సుధీర్ ప్రేమ్‌కుమార్‌ను నియమించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తోన్న డా. సుధీర్ ప్రేమ్‌కుమార్‌ను ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం 1991 కింద వీసీగా నియమిస్తున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్లపాటు ఆ పదవిలో వీరు కొనసాగుతారని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.