బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్ ):-
మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియో జకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెంకటగిరి మున్సి పాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఆప్కాస్ ఎంప్లాయిస్ గత నాలుగు నెలల నుండి జీతాలు అందిం చడంలో అధికారుల అలసత్వం వహించడంపై మున్సిపల్ కార్యాలయం వద్ద గత 15 రోజులుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను.మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులు సంప్రదింపు చేశారు. మున్సిపల్ అధికారులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే జమయ్యల ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో.సమ్మెను విరమించారు,అనంతరం వెంకటగిరి మున్సిపా లిటీ కార్మికులు మాట్లాడుతూ కార్మిక విధానలు నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ హయాంలో లోనే ప్రారంభమైయాయి. నేదురుమల్లి కుటుంబం ఎప్పటికి అన్యాయం చేయరని నమ్మకంతో సమ్మేవిరమించుడుంటున్నామని తెలిపారు.
పోటో:- మున్సిపల్ కార్యాలయం వద్ద నెదురుమల్లి
పోటో:-మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతున్న నెదురుమల్లి