అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) రూపొందించిన డైరీ, క్యాలెండర్లను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం 2024 సంవత్సరం డైరీ, క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి అందచేశారు. ఈ సందర్బంగా ఎపిఎండిసి నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలతో కూడిన క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్లు టి.నతానేయల్, ఆళ్ళ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.