కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్..
అష్మాన్ భారత్ కార్డు తో భారత దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా చికిత్స పొందవచ్చు నని వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఎస్. ఎస్. ఆర్ నాయుడు చెప్పారు. కలువాయి మండలం కుల్లూరు పంచాయతీలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమమం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్. ఎస్. ఆర్ నాయుడు ,ఎంపీడీవో గోవర్ధన్ మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎస్ ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ అష్మాన్ భారత్ కార్డు తో భారత దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా 5 లక్షల రూపాయలు వరకు చికిత్స పొందవచ్చు నని తెలిపారు.విశ్వకర్మ యోజన కింద 18 కులాల చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో రోజుకి 500 రూపాయలు గౌరవవేతనం ఇచ్చి 15 రోజుల తర్వాత వారికి అవసరమైన 15 వేల రూపాయల వరకు విలువ చేసే పనిముట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.అంతేకాకుండా వీటి ద్వారా 5% వడ్డీతో రుణాలు ఇస్తున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి, అటల్ జి పెన్షన్ అంత్యోదయ యోజన, జీవనజ్యోతి భీమా యోజన, అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని,అది ప్రభుత్వ అధికారుల విధి అని తెలియజేశారు. గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు , హెచ్. పి గ్యాస్ కనెక్షన్లు, నరేంద్ర మోడీ క్యాలెండర్లు, నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్. ఆర్ నాయుడుతో పాటు, కలువాయి మండల బిజెపి అధ్యక్షులు గొoది మల్లికార్జున నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి బ్రహ్మ రెడ్డి మహిళా మూర్ఛ సరస్వతమ్మ, నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి,వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, భారతీయ జనతా పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
………………
ఆష్మాన్ కార్డులు పంపిణి చేస్తున్న ఎస్ ఎస్ ఆర్ నాయుడు.
కార్యక్రమం లో మాట్లాడుతున్న ఎస్ ఎస్ ఆర్ నాయుడు