హైదరాబాద్ గండిపేటలో షర్మిల కొడుకు నిశ్చితార్థం
రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న సీఎం దంపతులు రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
గండిపేటలో నిశ్చితార్థం : గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో ఏం ఎస్ పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. . ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.