హైదరాబాద్ : ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.
నివాళులర్పించిన నారా భువనేశ్వరి : ఎన్టీఆర్కు ఆయన కుమార్తె, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెంట పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.