రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
కే ఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి*
విజయవాడ : కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పి జి కోర్సులలో ప్రవేశానికై జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత శుక్రవారం విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కే ఎల్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఎంతో అవసరమని అన్నారు. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షనీయమని అన్నారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే మెరిట్ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు కెఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో మూడు దశలుగా పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. మొదటి దశలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే రెండవ దశ పరీక్షలను ఫిబ్రవరి 2నుండి 5వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు తాము నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో పాల్గొని ఉత్తమమైన ర్యాంకులు పొందటం ద్వారా కేఎల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ద్వారా చదివే అవకాశం పొందవచ్చునని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఏటా నిర్వాహస్తున్న పరీక్షల్లో లక్ష మందికి పైగా హాజరువుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సెలర్స్ డాక్టర్ ఏ వి ఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఈ సి ఈ విభాగం అధిపతి డాక్టర్ సుమన్, అడ్మిషన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్స్ బొబ్బిలి సత్యనారాయణ మూర్తి, హెచ్ ఎస్ ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ ను కూడా మంత్రి ఈ సందర్బంగా ఆవిష్కరించారు.