గుంటూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఏపీ ఎస్పీఎఫ్ అధిపతి డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, బి వి రామిరెడ్డి ఇన్స్పెక్టర్ జనరల్ వారి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా 100 మంది ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది రెండు రోజులపాటు వాలీబాల్ , షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలలో పాల్గొని తమ సత్తా చాటారు. ఏపీఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీ వీ రామిరెడ్డి, బీ వీ రవి ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్ విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, ప్రొఫెసర్ బి కరుణ, రిజిస్టార్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎం శంకర రావు, జోనల్ కమాండెంట్, ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ చేతుల మీదుగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు ట్రోఫీలను బహూకరించారు. క్రీడల్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది సుమారు 400 మంది పాల్గొన్నారు.