అమరావతి : మాతా, శిశు, గర్భిణీ స్త్రీలు సంరక్షణ కొరకు నిర్ధేశించ బడిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 42 రోజులుగా సమ్మె చేస్తుంటే చర్చలు జరిపి ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించకుండా పరిధిలో లేని ఎస్మా ప్రయోగించి నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడం చట్ట విరుద్ధం అని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్ వెంకట్రావు లు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. పాదయాత్రలో అందరకు ఆశలు కల్పించి నట్లే అంగన్వాడీ లకు కూడా పొరుగు తెలుగు రాష్ట్రం కంటే అధికంగా ఇస్తానని ఊరు వాడా చెప్పి తీరా అధికారం వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చే దాని కంటే 1000 పెంచి చేతులు దులుపుకున్నారు పైగా మీరే డబుల్ పెంచినట్లు బుకాయిస్తు న్నారు.పొరుగు రాష్ట్ర వారు వర్కర్ కు 13,650 కు పెంచారు. మిమ్ములను తెలంగాణ వలె పెంచమని లక్షా ఆరు వేల మంది అంగన్వాడీ లు రోడ్ మీద కు వచ్చారు. ప్రభుత్వం సమ్మె విఫలం చేయడానికి తెల్లవారు జామున మహిళలను పోలీస్ చేత శిబిరాల నుండి బస్ లలో తరలించుట ప్రజాస్వామ్య బద్దంగా లేదు. నేడు తొలగింపు ఉత్తర్వులు దానితో పాటు నూతన నియామకాలు ఏంత వరకూ సమంజసం?. అంగన్వాడీ లలో చిచ్చు పెట్టడానికి వర్కర్ జాయిన్ కాకుండా హెల్పర్ జాయిన్ అయితే వర్కర్ గా పదోన్నతి ఇస్తామానడం బ్రిటిష్ రూల్ విభజించు పాలించు లాంటిదే. ఇలాంటి ఎత్తుగడలు ఆపి వారితో చర్చించి సమ్మె ముగింపు పలకండి. అంగన్వాడీ లకు అన్ని ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయన్నారు.