బాలాయపల్లి (వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-
వ్యవసాయ పంటలకు సంబంధించిన ఎరువులు డివిజనల్ దాటి విక్రయం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని గూడూరు వ్యవసాయ శాఖ ఏడి గోపీనాథ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న రసాయనిక ఎరువుల దుకాణా లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలలో సంబంధించి రైతులకు మాత్రమే వ్యవసాయ ఎరువులను విక్రయించాలన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా విక్రయిస్తే లైసెన్సులను రద్దుచేసి క్రిమి నల్ కేసులు నమోదు చేయడం జరుగుతుం దన్నారు.కోంత మంది ఎరువులు దుకాణ యాజ మాన్యం అధిక రేట్లకు అమ్మకాలు జరుగకుండా చూడాలని హెచ్చరించారు.ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారిణి శిరీష,బాలాయపల్లి సహాకార సంఘం అధ్యక్షుడు నల్లటి. రాంబాబు నాయుడు.తదితరలు ఉన్నారు.
పోటీ :- ఎరువులు దుకాణం తనకి చేస్తున్న ఏడీ