పేదింటి క్రీడాకారులను జాతీయస్థాయి క్రీడలకు తీసుకువెళ్లాలనే
ఆడుదాం ఆంధ్ర బహమతి ప్రధానోత్సవంలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు
తణుకు : పేదింటి బిడ్డలను జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలిచేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలులో బుధవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలు ముగిసిన సందర్భంగా విజేతలైన క్రీడాకారులకు మంత్రి కారుమూరి చేతులమీదుగా బహుతులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 క్రీడా పోటీల్లో రూ.120 కోట్లు బడ్జెట్ తో ఏకకాలంలోనే సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందచేసే విధంగా ఆడుదాం ఆంధ్రను రూపకల్పన చేయడం శుభపరిణామమన్నారు. ఈ రకమైన క్రీడా పోటీల ద్వారా మట్టిలో మాణిక్యాలుగా క్రీడాకారులు బయటకు వస్తారని అన్నారు. ఈ పోటీలను చూస్తుంటే ఇంతమంది క్రీడాకారులు మన ప్రాంతంలో ఉన్నారా అనే విధంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించిన తణుకు నియోజకవర్గ పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులను మంత్రి కారుమూరి ప్రత్యేకంగా అభినందించారు. మునిసిపల్ కమిషనర్ బీవీ రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ బహుమతి ప్రధానోత్సవంలో ఎంఈవోలు మురళి సత్యనారాయణ, హైమావతి, మునిసిపల్ డీఈఈ కొవ్వూరి ఈశ్వరరెడ్డి, ఏఈ డి. రామకిషోర్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నాయకులు రేలంగి రాంబాబు, జిలాని, వై.రామకృష్ణ. తణుకు మునిసిపాలిటీ, తణుకు అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.