రాపూరు -(వెంకటగిరి ఎక్స్ ప్రెస్) :-నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు,రాపూరు మద్దెల మడుగుసెంటర్లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో బిల్లులు లేకుండా తరలిస్తున్న 3,50,000 రూపాయలను ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం మీడియా సమావేశం నిర్వహించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ శ్రీనివాసరావు విజయవాడ నుంచి రాజంపేట కి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 3,50,000/- రూపాయలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు, బిల్లులు లేకుండా నగదు బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు…