సైదాపురం, జనవరి26,వెంకటగిరి ఎక్స్ ప్రెస్:
మండలం లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్ నాగినేని శ్రీనివాసులు, ఎంపీడీవో మీసాల వెంకటేశ్వర్లు, ఎస్ఐ చల్లా వాసు, ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా విష్కరణలు చేశారు. గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత పై వివరించి మిఠాయిలు పంపణి చేశారు.