నేషనల్ బీసీ కమీషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ ను కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అసమానతలు లేని సమాజం కోసం కులగణనే ప్రధాన లక్ష్యం
విజయవాడ : నేషనల్ బీసీ కమీషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కలిశారు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాలలోనూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై దుండ్ర కుమారస్వామి ఆయనతో చర్చించారు. హైదరాబాద్ కు వచ్చిన చైర్మన్‌ను హరితా ప్లాజా లో కలసి తెలంగాణా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సమస్యలు, బీసీల కోసం దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను, ఓబీసీలకు రిజర్వేషన్లు తదితర విషయాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తే సామాజిక, ఆర్థిక ,విద్య, ఉద్యోగ రాజకీయ రంగాలలో సంపూర్ణంగా వివరాలు లభ్యమవుతాయని అప్పుడే సామాజిక కులాల పరిస్థితులను తెలుసుకొని తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. ఓబీసీ జాబితాలో లేక పోవటం వల్ల బీసీ కులాలకు చెందిన పేద విద్యార్థులు జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు కోల్పోతున్నారని తెలిపారు దుండ్ర కుమారస్వామి. జాతీయ బీసీ కమిషన్ కులాలపై మరికొన్ని చర్యలు తీసుకోవాలని, రాష్ట్రాలలోని స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి మంచి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలుగా గుర్తింపు ఉన్న అన్ని కులాలను పరిశీలించి వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని కోరారు దుండ్ర కుమారస్వామి. ప్రస్తుతం దేశంలో బీసీ జాబితాలో ఉన్న కులాల కంటే అగ్రవర్ణాలలో ఉన్న కులాలకే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయని, బీసీలకు మాత్రం సమాన అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు దుండ్ర కుమారస్వామి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు సాయి యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, బీసీ దళ్ రాష్ట్ర కమిటీ పాల్గొన్నారు