నేడు టిట్కో ఇల్లు పంపిణీ చేయనున్నట్లు టిట్కో కోఆర్డినేటర్ కోటేశ్వరరావు తెలిపారు.1008 ఇళ్లకు తాళాలు అందజేస్తామని తెలిపారు. సోమవారం 10 గంటలకు ముఖ్య అతిధి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో హాజరై తమ ఫ్లాట్ తాళాలు తీసుకోవాలని సూచించారు.