ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీళ్లే..
☛ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజీర్ జిలానీ
☛ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీషా
☛ నంద్యాల జిల్లా కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు
☛ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిశక్త్ కిశోర్
☛ పార్వతీపురం జిల్లా మన్యం జాయింట్ కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్
☛ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ
☛ కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య
☛ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తిక్
☛ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భావన
☛ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజీంద్రన్
☛ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
☛ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి
☛ మున్సిపల్ శాఖ కమిషనర్‌గా బాలాజీ రావ్
☛ ఏపీయూఎప్‌ఐడీసీ ఎండీగా హరిత
☛ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రిటేర్‌గా ఇల్లకియా
☛ సర్వే సెటిల్మెంట్ అడిషనల్ డైరెక్టర్‌గా గోవిందరావు
☛ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తమీమ్ అన్సారియా
☛ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్
☛ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా విశ్వనాథన్
☛ ప్రభుత్వరంగ సంస్థల విభాగ కార్యదర్శిగా రేఖా రాణి
☛ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి బదిలీ