రాపూరు మండలం మద్దెలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆసరా పథకం ద్వారా అందించే చెక్కు.. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్,తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పొదుపు సంఘాలకు చెక్కును అందించడం జరిగింది. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే సుమారు78.98 లక్ష స్వయం సహాయక సంఘాలోని సుమారు 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాలో వైయస్సార్ ఆసరా పథకం ద్వారా జమవుతుందని వివరించినారు. చెప్పాడు అంటే చేసి చూపించే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారి వల్లనే వెంకటగిరి నియోజవర్గం అభివృద్ధి కుంటుపడిందని అందువలన అతనిని తొలగించి నన్ను సమన్వయకర్తగా నియమించి న్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కడప గడప తిరిగి మీ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసిన్నాను, నావల్ల పరిష్కారం కానీ వాటిని పై స్థాయి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేసిన నని చెప్పినారు.. వెంకటగిరి నియోజకవర్గానికి MLA అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని మీరందరూ నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని చెప్పినారు.. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు మండల స్థాయి అధికారులు, పొదుపు సంఘాల అధికారులు పాల్గొన్నారు.