టీడీపీ శ్రేణులు ల్లో నింపిన ఉత్సహాం
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
కలువాయి మండల వైసీపీ మండల నాయకులు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చల్లా రఘు రామిరెడ్డి ని టీడీపీ వెంకటగిరి నియోజకవర్గం వర్గం మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలిశారు. బెంగళూరు నుంచి ఆయన కలువాయి కి రావడం తో వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ వచ్చి రఘు రామిరెడ్డి నివాసం లో కలిశారు. ఈ సందర్బంగా రఘు ఆరోగ్యం గురించి మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం రాజకీయం గా చర్చించుకున్నారు. కురుగొండ్ల రావడం మండలం లోని తిరుమల పాడు, కేశమనేని పల్లి, చిన్న గోపవరం గ్రామాల నుంచి వైసీపీ నాయకులు గంగిరెడ్డి రమణ రెడ్డి, రామసుబ్బానాయుడు, జనార్దన్ యాదవ్ లు రఘు రామిరెడ్డి ని కలవడం తో మండల నాయకుల్లో చర్చ మొదలైంది. రఘు వైసీపీ లోనే ఉంటారా లేక టీడీపీ లోనికి వెళ్తారా అని రాజకీయ విశ్లేషకులు అన్వేషస్తున్నారు. కురుగొండ్ల రామకృష్ణ,రఘు రామిరెడ్డి కలవడం తో టీడీపీ శ్రేణులు ల్లో ఉత్సహం నింపింది.