విజయవాడ : విజయవాడ నగరాన్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఎంతో అభివృద్ధి చేశారని వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అభినందనలు తెలియజేశారు. శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని బందర్ రోడ్ లో ఉన్న అయన కార్యాలయంలో ఆకుల శ్రీనివాస్ సుమారు 50 మంది సీనియర్ నాయకులతో వెళ్ళి కలిసి బొకేతో సత్కరించారు . ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గం అభివృద్ధి మీతోనే సాధ్యమైందని ప్రశంసించారు. నగరంలొ మంచి ప్రణాళికతో భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకుండా ప్రధాన కూడలి బెంజ్ సర్కిల్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, వన్ టౌన్ లో అతి పెద్ద కనక దుర్గ ఫ్లై ఓవర్ నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. నగరంలో ట్రాఫిక్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా పెద కాకాని నుండి అవుటపల్లి వరకు నాలుగు రోడ్లు లైన్ గల బైపాస్ రోడ్డు నిర్మాణం,టాటా ట్రస్టు ద్వారా ఎన్టీయార్ జిల్లా వ్యాపితంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అరోగ్య సేవలు అందించడం, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ట్రాక్టర్లు ద్వారా మంచి నీటి సౌకర్యం అందించడం వంటి కార్యక్రమాలు చేయడం మీ వల్లే సాధ్యం అయ్యిందని నాని సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలు ద్వారా ప్రజలకు సేవచేయాలనే దృక్పథంతో మీరు వైఎస్సార్ పార్టీ లోకి రావడం శుభ పరిణామం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని తో పాటు ఏడు అసెంబ్లీ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని,నాని రెండు లక్షల ఓట్లు మెజారిటీతో గెలుపొందటం ఖాయమని ఆకుల శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు పొదిలి చంటి బాబు, అల్లం పూర్ణ చంద్రరావు,యరజర్ల మురళి, ఆర్టీసి సుబ్బా రెడ్డి, మేళం చిన్నా, బొమ్ము రాము, వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకుడు సూరసాని రామిరెడ్డి, లేళ్ల లాజర్,ఎం వెంగల రెడ్డి, కునిసెట్టి వెంకటేశ్వరరావు, బసవ బోసు, తదితరులు కలిశారు.