గుంటూరు : ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు విధానాలు నచ్చకపోవడంతో వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.