డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి :02 త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి వైకాపా పార్టీ నుండి దాదాపుగా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఖరారు అయ్యారు, ఇటు టిడిపి నుండి అభ్యర్థి ఎవరనేది నియోజకవర్గం ఆరు మండలాల్లో ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి గురి అయ్యున్నారు. నేదురు మల్లి రాంకుమార్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారని విజయ్ సాయి రెడ్డి పార్టీ తరఫున బాహాటంగానే ప్రకటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మొట్టమొదటిగా డక్కిలి మండల కేంద్రంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని స్థాపించి విజయం నాదే అంటూ ప్రకటించారు రామ్ కుమార్ రెడ్డి. గత ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ ఓటమి పాలయ్యారు. అయినా కూడా పార్టీ ఇన్చార్జిగా వెంకటగిరి నియోజకవర్గంలో టిడిపి బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే వెంకటగిరి స్థానికుడు డాక్టర్ బొలిగుల మస్తాన్ యాదవ్ వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ఆశించి తన ప్రయత్నాలను కార్యక్రమాలను ముమ్మరం చేయడమే కాక నేను బరిలో ఉన్నాను అనే సంకేతాలు ఇచ్చారు. మరొకవైపు వైకాపా వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి గత కొన్ని నెలలుగా తిరుగుబాటు జెండా ఎగిరేసి టిడిపి చెంతకు చేరారు. వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణకు అవకాశం వస్తుందని నియోజకవర్గంలోని కాక డక్కిలిలో ప్రతి ఒక కార్యకర్త నాయకులు ఓకే మాటగా ఉండేది, ఆనం ఆత్మకూరు లో పోటీ చేస్తారన్న భావన ఇక్కడ అందరిలో ఉంది. గత రెండు సంవత్సరం నుండి వెంకటగిరిలో అన్న క్యాంటీన్ ద్వారా కురుగొండ్ల ప్రజలకు భోజనం అందిస్తున్నారు, అనేక పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు కుటుంబాలకు తన వంతు సహాయక సహకారాలు అందించి వారికి నేనున్నానన్న భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో బొలిగుల మస్తాన్ యాదవ్ ఉచిత వైద్య శిబిరాలు, పార్టీ కార్యక్రమాలు నేరుగా అధినేత నారా చంద్రబాబు నాయుడు తో పరిచయాలు ఉన్నందువలన ఆయన కొంత ఇమేజ్ను సంపాదించుకోవడం జరిగింది. సీనియర్ నాయకులు మాజీ ఆర్థిక మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం కొత్త అయినా తొందరగా తనకంటూ నాయకులతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు సిట్టింగ్ శాసన సభ్యులుగా అవసరం అనుకుంటే వెంకటగిరి నుండి నేను పోటీకి సై అంటున్నారు. ఇక నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి , శ్రీమతి రాజ్యలక్ష్మి కొడుకుగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా ప్రజలలో ఉంటూ తనకంటూ ఒక పాపులారిటీ ఒక అనుచర వర్గం ఆయనకు ఇక్కడ ఉంది. ఇతనుకు సౌమ్యుడు, వివాద రహితుడుగా, ఎలాంటి అవినీతి మరక లేనటువంటి వ్యక్తిగా ప్రజలలో పేరు ఉంది. డక్కిలి మండలంలో వైకాపాలో చిన్నచిన్న సమస్యలు ఉన్న వాటిని కూడా సరి చేసుకుని గత ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా సాధించు తాము విశ్వాసం నమ్మకంతో నేదురుమల్లి, ఆ పార్టీ నాయకులు శ్రేణులు ఉన్నారు. మరోపక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనుకూల పవనాలు నియోజకవర్గంలో కురుగొండ్ల రామకృష్ణకు ఉన్నటువంటి నాయకులు కార్యకర్త బలంతో వైకాపా అభ్యర్థి ఎవరినైనా ఓడించే ఛాన్స్ ఉందని, ఆనం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పై ఇక్కడనుండి పోటీ చేస్తే రామ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువ అని మండలంలో విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ఆనంకు కలువాయి రాపూరు సైదాపురం మండలాల్లో కొంత బలమున్న డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లిలో కొంత టిడిపికి నష్టం జరిగి వైకాపా లాభపడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక డాక్టర్ బొలిగుల మస్తాన్ యాదవ్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు పేద వర్గాలు బడుగులు దళితులు ఓట్లు వేసిన టిడిపిలోనే బలమైన సామాజిక వర్గాలు సహకరించే అవకాశం లేదని ఇదే ప్రచారం కూడా మండలంలో ఉంది. కురుగొండ్ల రామకృష్ణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సరిగాలేదని నేదురుమల్లిని ఆర్థికంగా ఎదుర్కోవాలంటే ఆనం ఎంత ఖర్చైనా పెట్టినందువలన విజయం ఆనం సొంతం అవుతుందని ఓ వర్గంలో ప్రచారం గా ఉంది. ఈసారి ఎన్నికలలో కురుగుండ్ల రామకృష్ణ కు ప్రజలలో సానుభూతి ఉందని నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి పై రామకృష్ణ పోటీ చేస్తే గట్టి పోటీ ఉంటుందని రామకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలవడం కాయమంటున్నారు కొందరు టిడిపి నాయకులు. అదే నేదురుమల్లిపై ఆనం పోటీ చేస్తే నేదురు మల్లి సునాయాసంగా విజయం సాధించుతారని టిడిపిలో మరుకొందరు వాదన. మరో నాలుగు ఐదు రోజుల్లో జనసేన టిడిపి అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చి వెంకటగిరి టిడిపి అభ్యర్థి ఎవరు అనేది తేలేది అప్పుడే. అయినా కూడా అందరిలో ఒక ఉత్కంఠ వాతావరణ మండలంలో కనబడుతోంది. టిడిపిలో మండలంలో పెద్దగా గ్రూపులు లేకుండా ఎన్నికల జరిగిన క్రాస్ ఓటింగ్ అవకాశం లేకుండా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేసే పరిస్థితి ఉంది. గత ఎన్నికలలో సైతం వెంకటగిరి అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటిస్తున్నందువలన అధిష్టాన నిర్ణయంపై కొంత అసహనం ఇక్కడ కనబడుతోంది. అయితే ఈసారి కురుకుండ రామకృష్ణకు వెంకటగిరి టికెట్ కేటాయించకుండా ఆనం గాని, బొలిగుల మస్తాన్ యాదవ్ కి గాని టిడిపి టికెట్ ఇస్తే కొంత క్రాస్ ఓటింగ్ కు అవకాశం ఉంటుందని మండలంలో చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైకాపా తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి దాదాపు ఎన్నికల ప్రచారం లో ఉన్నట్లు ఉంది. గత ఎన్నికలలో ఒక ఛాన్స్ అన్న జగన్ భారీ సీట్లతో విజయం సాధించారు. ఈసారి ఆ పరిస్థితి కొంత మార్పు కనబడుతున్న ప్రజలకు నేరుగా మేలు జరిగినందువలన మరల వైకాపాకు ప్రజలు ఓట్లు వేస్తారని రైతులకు, మహిళలకు లాభం చేకూర్చే పథకాలు ఈ ఎన్నికలలో మేనిఫెస్టో ఉంటుందని మరల వైకాపా అధికారంలోకి రావడం జరుగుతుందని మండలంలో వైకాపా పార్టీ నాయకులుల్లో ఉంది.అందుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు, మరో ప్రక్క తన శక్తి యుక్తులు ఆర్థిక అంగబలాన్ని ప్రదర్శించి విజయం నాదే అన్న ధీమాతో ఉన్నారు.అటు టిడిపి శ్రేణులు ప్రజలు వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారని గత ఫలితాలు తారుమారు అవుతాయని అంచనాలో వారు ఉన్నారు.