నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం లోని శానయ్యపాలెం పంచాయతీ తాటిపల్లి గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాన్ని ఆమె పరామర్శించారు రాపూరు మండలం శానయ్యపాలెం పంచాయతీ తాటిపల్లి గ్రామంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక కలువాయి టిడిపి కార్యకర్త సన్నీబోయిన కృష్ణయ్య గుండెపోటుతో మృతి చందాడు నిజం గెలవాలి పరామర్శలు భాగంగా మృతుడు చిన్నయ్య కుటుంబ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు, కృష్ణయ్య కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందజేశారు, ఈ సందర్భంగా భువనేశ్వరి అందరికీ అభివాదం చేశారు మహిళలను పలకరిస్తూ వెళ్లారు.
ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్లరామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బోలిగర్ల మస్తాన్ యాదవ్ వీరందరూ భువనేశ్వరికి ఘన స్వాగతం తించారు ఈ కార్యక్రమంలో రాపూరు టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, ఎం ఎం టి మధు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు