డక్కిలి :వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :డక్కిలి మండల 7వ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం జరిగింది . ఎంపీపీ గోను రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డి ఉప్పరపల్లి, వెంబులూరు గ్రామపంచాయతీలో రేషన్ సరుకుల పంపిణీ సరిగా లేదంటూ అందుకు సివిల్ సప్లై డీటీ సమాధానం చెప్పాలని సభ్యులు కోరారు. సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రసన్న సమావేశానికి రావడం మొదటిసారి కావడం, ఎలా సమాధానం చెప్పాలో తెలియకపోవడంతో సభలో ఉన్న సభ్యులు కొందరు ఆమెను ఉద్దేశించి మీరు సభ నుండి వెళ్లి మీ తాహిసిల్దారును సమావేశానికి రమ్మని చెప్పడంతో డిటి ప్రసన్న అవమానకరంగా సభ నుండి బయటికి వెళ్లిపోయారు. మండలంలో పనిచేసిన వైయస్సార్ క్రాంతి పథం ఏపీఎం పోలమ్మను అన్యాయంగా, ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఇక్కడ నుండి బదిలీ చేశారని లింగసముద్రం ఎంపిటిసి కోటేశ్వరరావు ఏరియా కోఆర్డినేటర్ ఆదినారాయణ నిలదీశారు. 2016 నుండి 2023 డిసెంబర్ వరకు వైయస్సార్ క్రాంతి పథం డక్కిలి మండలంలో పొదుపు రుణాలు, శ్రీనిధి , సంఘ బంధం నిధులపై సమగ్ర విచారణను బయటపెట్టాలని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఏపీఎం సూచనలతోనే ప్రస్తుతం ఆ కార్యాలయంలో ఏపిఎం పోలమ్మకు సహాయ నిరాకరణ జరిగిందని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత మూడు నెలల కాలంలో మండలంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పంపిణీ, లెక్కలు తదితర అంశాలపై సభ్యులు అధికారులు సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ( సుధీర్ రెడ్డి) ఎంపీడీవో లీలా మాధవి, హౌసింగ్ డి ఈ జహీర్ అహ్మద్, వైద్యాధికారి బిందు మాధవి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏఈ అశోక్, వ్యవసాయ అధికారి విజయభారతి, ఇరిగేషన్,త్రాగునీరు, ఉపాధి హామీ, అంగన్వాడి తదితర అధికారులు, గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు.