విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసిందనేది గడప గడపకు తీసుకువెళ్తామని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎందాస్ పేర్కొన్నారు. ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ నిర్వహించనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఉద్యోగులు దీనిలో పాల్గొంటారని తెలిపారు. గత ఎన్నికలకు ముందు పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.