వెంకటగిరి …వెంకటగిరి ఎక్స్ప్రెస్,,,,
-మాయమాటలతో మోసం చేయడం చేతకాదు*
తండ్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి లను మరిపించేలా వెంకటగిరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానుభవన నిర్మాణ కార్మికులు, టైలర్ లకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా
– *వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి భరోస
వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి లకు ఈ ప్రాంత ప్రజానీకానికి సేవ చేయడంతో పాటు వెంకటగిరిని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపే అవకాశం ఇచ్చారని అదే తరహాలో నాకు సేవచేసే అవకాశాన్ని ఇస్తే అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని వెంకటగిరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపార వెంకటగిరి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులకు టైలర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని, ఇతరుల్లా కల్లబొల్లి మాటలు చెప్పే అలవాటు తనకు లేదన్నారు. మాటిస్తే దానిని నెరవేర్చెందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పలు సమస్యలపై వచ్చిన స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు.