విజయవాడ : ఆఫీస్ స్టాప్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ 2024 ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా ఎం డీ మాట్లాడుతూ ఆఫీసు సిబ్బందికి ఉపయోగకరమైన సమాచారంతో డైరీ ముద్రించి సభ్యులకు ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. ఆఫీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఓస్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శివప్రసాద్, రాష్ట్ర నాయకులు ఎంవి కొండారెడ్డి, కే. హరినాద్ రెడ్డి ,టీజే రావు , మధు పాల్గొన్నారు