విజయవాడ :ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో అమ్మవారి ఆలయమునకు విచ్చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024-2025 ఆర్ధిక సంవత్సర అంచనా బడ్జెట్ ను శ్రీఅమ్మవారి వద్ద సమర్పించి, పూజలు జరిపి అమ్మవారి ఆశీర్వాదములు పొందిన రాష్ట్ర ఆర్ధిక శాఖ బృందం – ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ ఎస్ రావత్, IAS గారు,
ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ KVV సత్యనారాయణ, IRAS గారు, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి(FAC) శ్రీ బి సునీల్ కుమార్ రెడ్డి, IFS గారు…
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనము కల్పించిన
ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు గారు మరియు ఆలయ అధికారులు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ ఆర్ కోటేశ్వర రావు సహాయ కార్యనిర్వాహనాధికారి ఎన్ రమేష్ ఉన్నారు.