బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
నులుపురుగులు మాత్రలు వేసే టప్పుడు అప్రమ త్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది నులిపురుగుల దినోత్సవం బాధ్యతగా నిర్వహించాలని ఎం పి డి ఓ ఏ అరుణ పేర్కొన్నా రు. గురువారం స్థానిక ఎంపీడీ వో కార్యాలయంలో నులిపురుగుల దినోత్సవం పై వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ ఈనెల 9వ తేది జరుగుతున్న జాతీయ నులిపు రుగుల దినోత్సవం విజయవంతం చేయాల న్నారు. నులిపురుగులు మందులు వేసే ముందు వైద్య సిబ్బంది ఆ యా పాఠశాలల్లో ఉపాధ్యా యులకు విద్యార్థులకు అవగాహన కల్పించాల న్నారు. భోజనం చేసిన తర్వాత నులిపురుగులు మాత్రలు వేసుకోవాలని తెలియజేయాలన్నారు. ఆశ వర్కర్లు సంబంధిత పాఠశాలల వద్ద నులిపురుగులు మాత్రలు దగ్గర ఉండి వేయడం జరగాలన్నారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. బాధ్యతగా పనిచేసే విజయవంతం చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం జాతీయ నులిపురుగుల దినోత్సవం వాల్ పోస్టర్ విడుదల చేశారు.వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- వాల్ పోస్టర్ విడుదల చేస్తున్న దృశ్యం