అమరావతి : రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై సీఎం అధ్యక్షతన గురువారం నిర్వహించనున్న సమావేశానికి రావాలని కమిటీలో సభ్యుడైన ప్రతిపక్షనేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఖాళీ అయిన 3 సమాచార కమిషనర్ల భర్తీకి నిర్వహించే కమిటీ మీటింగ్కు హాజరు కావాలని లేఖలో పేర్కొంది. 8న సెలక్షన్ కమిటీ మీటింగ్ ఉందని 3 రోజుల ముందు సమాచారం ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాల ముందుగా సమాచారం ఇవ్వాలని లేఖ ద్వారా బదులిచ్చారు. కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. ఉప లోకాయుక్త నియామకం విషయంలో కూడా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు