హైదరాబాద్ : నెక్లెస్‌రోడ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందన్నారు. ఒక కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే 441 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదని, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, సింగరేణి సీఎండీ తదితరులు పాల్గొన్నారు.