తప్పు చేసిన వారే బయపడుతారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ సీయం కేసీఆర్ కొత్త నాటాకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ఱా రావు అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రి జూల్లి మీడియాతో మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ గెలుచుకునే పరిస్థితి లేదు. మరోవైపు వరుస కట్టి ఆ పార్టీ లో ఉన్న ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల్లో తన పరువు కాపాడుకోవడానికి కేఆర్ఎంబీ పేరు చెప్పి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు.
తెలంగాణ ప్రజల అకాంక్షాల మేరకు సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది
అనంతరం 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల అకాంక్షలకు భిన్నంగా పరిపాలన చేశారు.తెలంగాణ తెచ్చుకుందే నిధులు, నియమాకాల కోసం కానీ నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే…. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేక పోయింది. అన్యాయం జరుగుతుంటే ఉద్యమించాల్సి పోయింది కేంద్ర ప్రభుత్వంతో చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగారు.
రైతు చట్టాలు, జీఎస్టీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలికింది. అయితే నీటి వాటాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సింది పోయి మోకారిల్లింది.
ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ లో తెలంగాణ పరివాహక ప్రాంతం 68.5%. అయితే సాధరణంగా నీటి కేటాయింపులు పరివాహక ప్రాంతం, కరువు నేలలు, జనాభా, సాగుయోగ్యమైన భూముల వంటి ఆంశాల ఆధారంగా జరుగుతాయి. అందుకు అనుగుణంగా తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకీ 260 టీఎంసీల కృష్ణా జలాలను పంచేలా డిమాండ్ చేయాల్సి ఉన్న దానికి భిన్నంగా కేవలం తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చకుంది.
అయితే గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీల నీటి వాటాను వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పోని ఈ వాటాను అన్న సరిగ్గా వాడుకుంది అంటే అదీ లేదు. నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ లో 2013-2014 కు ముందు దాదాపుగా 150 టీఎంసీల పైగా నీటీని తెలంగాణ వాడుకుంటే….. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సగటున 85 టీఎంసీలను మాత్రమూ వాడుకుని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు.
గడిచిన ఐదేండ్లలో నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ నీళ్లను సగటున 35 టీఎంసీలను మిగుల్చకుని, తదుపురి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తో వాటా కల్పించినది మీ ప్రభుత్వమే కదా
కానీ ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ద్వారా 34 టీఎంసీలు వాడుకోవాల్సింది పోయి 100 టీయంసీలకు పైగా కృష్ణా నదీ జలాలను ఇతర బేసిన్ లకు తరలించుకుపోతే… నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా
దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరోక్షంగా హక్కులు కల్పించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
అంతేకాకుండా పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యుల్ లేనటువంటి పాలమూర్ – రంగారెడ్డి, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను ఆ షెడ్యూల్ చేర్చామని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సాధించగలిగిందా అంటే అదీ కూడా లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలిగొండ, టీజీపీ ప్రాజెక్ట్ లను 11వ షెడ్యుల్ ఉండగా, బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పకపోగా కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తపోతల పథకం ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి సహకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
15 జూలై, 2021 లో తెచ్చిన గజీట్ నోటిఫికేషన్ లో పాలమూర్ – రంగారెడ్డి, దిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్ట్ లు అని పొందుపరిచినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయింది. దీన్ని సరి చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఉన్న లోపాయికారీ ఒప్పందం ఉంది.
అంతేకాకుండా ఐఎస్ డబ్ల్యూ ఆర్ డీ యాక్ట్ 1956 లోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించిన ఫిర్యాదు మేరకు ట్రిబ్యునల్ కు ఒక సంవత్సరంలోగా నివేదించాల్సి ఉండగా, 10 సంవత్సరాల కాలయాపన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అంతేకాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, మళ్లీ 5 ఏండ్ల తర్వాత అవగాహనరాహిత్యంతో కేసును ఉపసంహరించుకుంది. దీని వల్ల విలువైన సమయం వృదా చేయడమే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించింది.
2021, జూలై 15న గజీట్ నోటిఫికేషన్ ద్వారా కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్ట్ లపై కేంద్ర ప్రభుత్వ సర్వాధికారాలు కట్టబెట్టినప్పుడు నోరు మెదపకుండా కూర్చుంది మీరే కదా
మీరు ఏదైతే ధర్నా, పోరాటం చేస్తామని చెప్పుతున్నారో , ఆ పోరాటమేదో కేంద్ర ప్రభుత్వంపై అప్పుడే చేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఇప్పుడు అధికారంలో కొల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్వేగాలను, మనోభావాలతో రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్తగా కేఆర్ఎంబీ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
పాలమూర్ – రంగారెడ్డి, దిండి, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్ట్ లను పూర్తి చేయకుండా లక్షల కోట్ల రూపాయాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వెచ్చించి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీటిని అందించలేకపోయినారు. ఈ ప్రాంత ప్రాజెక్ట్ ల నీటిని సద్వినియోగం చేసుకున్నట్లైతే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలంగా మన వాదనలు వినిపించే వాళ్లం. ఈ రకంగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు తీవ్ర అన్యాయం చేసి ఇప్పుడు దర్నా చేస్తామనడం అర్ధరహితం, అవివేకం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ లను అప్పగించడానికి ఒప్పుకోలేదు. భవిష్యత్ లో కూడా ఒప్పుకోం
ఈ మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యలు వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్ల పల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.