హైదరాబాద్ : బాసర జ్ఞాన సరస్వతీ దేవీ జన్మదినోత్సవమైన వసంత పంచమి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14 న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో వి. విజయ రామారావు, ఎఈవో సుదర్శన్, ఆలయ ఛైర్మన్ శరత్ పాఠక్, వేదపండితులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. బాసరలో ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు వైభవోపేతంగా వసంతపంచమి ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవాదాయ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.