మిల్లీ బాబీ బ్రౌన్, హెన్రీ కావిల్ నటించిన ఎనోలా హోమ్స్ 2 ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ తన గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్ టుడమ్ సందర్భంగా శనివారం విడుదల చేసింది నాన్సీ స్ప్రింగర్ రాసిన నవలల ఆధారంగా జాక్ థోర్న్ రాసిన స్క్రీన్ప్లేలతో హ్యారీ బ్రాడ్బీర్ దర్శకత్వం వహించిన ఎనోలా హోమ్స్ సినిమా ప్రస్తుతం హాలీవుడ్ లో నయా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాజాగా ఎనోలా హోమ్స్-2 చిత్రం ఓటీటీలో హల్ చల్ చేస్తోంది. ఎనోలా హోమ్స్ మొదటి భాగం కొవిడ్ మహమ్మారి మొదటి వేవ్ సమయంలో విడుదలైన విషయం తెలిసిందే.