కర్ణాటక మాజీ సభ్యుడు డాక్టర్ రఫిక్ అహ్మద్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ
జాతీయ సమన్వయ కర్త, ఏపీ ఇంచార్జ్ గడ్డిపాటి విజయ్ కుమార్
విజయవాడ : రాష్ట్రంలోని ముస్లిం క్రైస్తవ మైనార్టీలందరూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెంటే నడవాలని కర్ణాటక మాజీ శాసనసభ్యులు జాతీయ మైనార్టీ సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డాక్టర్ రఫిక్ అహ్మద్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ భాగం రాష్ట్ర అధ్యక్షులు శాలి దాదా గాంధీ అధ్యక్షుడు జరిగిన మైనార్టీ భాగం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పది సంవత్సరాల ప్రధాని మోడీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, దేశంలో 142 కోట్ల మంది ప్రజలు నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో నరహంతక పాలన నడుస్తుందని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోడీ పాలనకు దేశ ప్రజలందరూ సమిష్టిగా ఉద్యమించాలని ఆయన కోరారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ భాగం జాతీయ సమన్వయకర్త గడ్డపాటి విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు ప్రధాని మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మైనార్టీ సోదరులు ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ సమన్వయకర్త కొరివినయ్ కుమార్, మైనార్టీ భాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్క చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా ,షేక్ నాగూర్ షేక్ బషీర్ అహ్మద్, తరాలపాటి జానీ హిందూపూర్ అమానుల్లా, తిరుపతి పఠాన్ నన్నే ఖాన్, రాయచోటి గౌస్, పల్నాడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్ఎం భాష, అధ్యక్షులు షేక్ ఉస్మాన్, మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు షేక్ సలీం, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ భాష, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు వినాయతుల్లా ఖాన్ షేక్ ఖాదర్ , సయ్యద్ నసీమా, సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల మహబూబ్ భాష, జిల్లాల అధ్యక్షులు మైనార్టీ డిపార్ట్మెంట్ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సూచనలు సలహాలు ఇచ్చారు.
తీర్మానాలు ఇవీ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ భాగం విస్తృత స్థాయి సమావేశం ఈ తీర్మానాలను ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ నూతన పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైన షర్మిలమ్మ కి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. షర్మిలమ్మ పై సోషల్ మీడియాలో కించపరుస్తూ ట్రోల్ చేయడానికి సమావేశం తీవ్రంగా ఖండించింది. క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని సమావేశం డిమాండ్ చేసింది. 2024 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు 25 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో అవకాశం కల్పించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ సమస్త గత నిర్మాణంలో రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు అన్ని కార్యవర్గాలలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో ముస్లింల వర్క్స్ బోర్డ్ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని వర్క్స్ బోర్డ్ కు అప్పగించాలని సమావేశం ఏకాగ్రేయంగా తీర్మానించింది. దేశంలో రాష్ట్రంలో లౌకిక, సామ్యవాద రాజ్య స్థాపనకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు, క్రైస్తవులు మద్దతు తెలపాలని సమావేశం తీర్మానించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు శాలి దాదా గాంధీ తెలిపారు.