సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్10: ఉన్న జాబ్ తో పాటు మరో పార్ట్ టైం జాబ్ చేయాలని ఆన్ లైన్ లో వచ్చిన యాప్ ను లింక్ చేయడంతో ఓ యువతి నగదు మాయమైన ఘటన సైదాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీస్ కథనం మేరకు రాపూరు క్రాస్ రోడ్డు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పోతిరెడ్డి శ్రీనివాసులు కుమార్తె పోతిరెడ్డి లిఖిత బెంగుళూరు లోని ఓ ప్రవేట్ కంపెనీలో పని చేస్తుంది.వర్క్ ఫర్మ్ హోమ్ తో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తుంది. పార్టీ టైం జాబ్ చేయాలని తన మొబైల్ ఇన్ స్త్రా యాప్ లో వచ్చిన లింక్ ను ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసింది. వెంటనే రూ.2.80 లక్షల నగదు మాయం అయింది. శివాని అనే పేరు మీద నగదు బదిలీ కావడం తో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు.