అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎక్సిక్యూటివ్ చైర్మన్జ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి ఆవిష్కరించారు. గత కాలంలో రాష్ట్రం లోని జిల్లా, మండల న్యాయసేవాధికార సంస్థలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరిస్తూ పొందుపరచిన న్యూస్ లెటర్ ను ఆయన హైకోర్టు ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు. అర్హులైన అందరికి ఉచిత న్యాయసహం అందించడంలోనూ, ప్రజలకు న్యాయవిజ్నానాన్ని కల్పించంలోనూ యీ సంస్థలు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి మజ్జి బబిత, హైకోర్టు లీగల్ సర్వీసు ల కమిటీ కార్యదర్శి జి.మాలతి, రాష్య్ న్యాయసేవాధికార సంస్థ పరిపాలనాధికారి డాక్టర్ హెచ్. అమర రంగేశ్వరరావు పాల్గొన్నారు.