డక్కిలి :వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎఫ్ఎంసి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న నూతన కలుపు మందులపై డక్కిలి మండలంలో పలు గ్రామాల రైతులకు ఎఫ్ఎంసీ కంపెనీ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ డిఎం ఓబుల్ రెడ్డి, నెల్లూరు జోనల్ మేనేజర్ సుబ్బారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కంపెనీ నూతన కలుపు మందు వేరే బుల్ బ్రాండ్ ను వెయ్యి మంది రైతులకు వారి పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించడం జరిగిందని కలుపు ముందు పనితనం వినియోగాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. రైతులకు ఉపయోగకరంగా లాభదాయకమైన పంటలు దిగుబడి సాధించుటకు నాణ్యమైన కలుపు మందులు ఉత్పత్తి అమ్మకం మా యొక్క లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, మాధవరెడ్డి, టిబిఎం రాకేష్ , ఉత్పత్తి అధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.